Liquor Scam : న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్న ఎమ్మెల్సీ కవిత

Liquor Scam : న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్న ఎమ్మెల్సీ కవిత
మహిళాబిల్లు కోసం ఎల్లుండి ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో కవిత నిరాహార దీక్ష చేయనున్నారు

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో...ఈడీ నోటీసులివ్వడంతో విచారణకు హాజరు కావాలా? వద్దా? అన్న అంశంపై న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నారు ఎమ్మెల్సీ కవిత. ముందస్తు షెడ్యూల్‌ ఉండటంతో.. విచారణ వాయిదా కోరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈడీకి లేఖ రాసే యోచనలో ఉన్నారు. మహిళాబిల్లు కోసం ఎల్లుండి ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో కవిత నిరాహార దీక్ష చేయనున్నారు. ఈ దీక్షకు 18 పార్టీల నేతల సంఘీభావం ప్రకటించాయి. ఇప్పటికే ఢిల్లీలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు బీఆర్‌ఎన్‌ నేతలు. ఈ నేపథ్యంలో.. రేపు విచారణకు రావాలంటూ.. ఈడీ నోటీసులు ఇవ్వడంతో.... రాజకీయాలు హీటెక్కాయి. న్యాయనిపుణలతో చర్చల అనంతరం... ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తోనూ భేటీ కానున్నారు కవిత. ఈడీ నోటీసులు, ఢిల్లీలో దీక్షపై, మోదీ సర్కారు చర్యలు తదితర అంశాలపై కేసీఆర్‌ చర్చించనున్నారు.

15వ తేదీ తర్వాత విచారణకు హాజరవుతానంటూ ఎమ్మెల్సీ కవిత ఈడీకి లేఖ రాశారు. 10వ తేదీ ఢిల్లీలో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా..ఇతర కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్‌ ఫిక్స్‌ అయ్యిందని ఈడీకి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం కవిత.. ఈడీ స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. ఐతే.. కవిత విజ్ఞప్తిని ఈడీ ఒప్పుకుంటుందా… లేదా అనే అంశం ఉత్కంఠ రేపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story