బెడ్‌రూంలోకి పాము దూరి మంచం ఎక్కి..

పెరట్లో పాము కనిపించిందంటే ఇంట్లోకి పరిగెట్టి తలుపేసుకుంటారు. అలాంటిది ఇంట్లోనే పాము పైగా బెడ్‌రూంలో ఉన్న బెడ్ పైకి ఎక్కిందంటే.. వామ్మో గుండె ఆగినంత పనవుతుంది. ఈ షాకింగ్ ఘటన ఒడిశాలోని కటక్ జిల్లాలోని హరిరాజ్ పురా గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో పెద్ద నాగుపాము కనిపించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పాము చొరబడి ఉంటుంది. అది కాస్త బెడ్ ఎక్కి దాని మీద తిష్ట వేసింది. ఇంటికి వచ్చిన శరత్ పాండాకి పాము శబ్దాలు వినిపించాయి. బెడ్ మీద పెద్ద నాగుపాము ఉన్న విషయాన్ని గుర్తించాడు. వెంటనే స్నేక్ హెల్ప్ లైన్ కి ఫోన్ చేసి తెలిపాడు. వారు వచ్చి పామును పట్టుకొని సమీపంలోని అడవిలో వదిలేశారు. అయితే ఇది విషసర్పమని, 5 అడుగుల పొడవు ఉంటుందని చెప్పారు. వర్షాకాలం.. అందునా గత వారం రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పాము ఆశ్రయం కోసం ఇంట్లోకి చొరబడి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com