North Korea : అమెరికాతో పోరాడేందుకు 8 లక్షల సైన్యం

అమెరికాకు వ్యతిరేకంగా పోరాడేందుకు దాదాపు 8,00,000 మంది ఉత్తర కొరియన్లు దేశ సైన్యంలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. ఉత్తర కొరియా తన హ్వాసాంగ్-17 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM) ను ప్రయోగించిన తర్వాత యువకులు సైన్యంలో చేరడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. క్షిపణి ప్రయోగాన్ని ఉత్తర కొరియా ధృవీకరించింది, ఇది అమెరికా, దక్షిణ కొరియాలకు "బలమైన హెచ్చరిక" అని పేర్కొంది.
"Democratic People's Republic of Korea (DPRK)కు వ్యతిరేకంగా యుఎస్, దక్షిణ కొరియా నిర్వహించిన ఉన్మాద, రెచ్చగొట్టే యుద్ధ కసరత్తుల కారణంగా కొరియా ద్వీపకల్పంలో అత్యంత అస్థిర భద్రతా వాతావరణం ఏర్పడుతోంది. సెంట్రల్ మిలిటరీ కమీషన్ ఆఫ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా (WPK) మార్చి 16న ICBM Hwasongfo-17 యొక్క లాంచింగ్ డ్రిల్ నిర్వహించేలా చూసింది." అని ఉత్తర కొరియా అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com