వారు మాత్రం అసెంబ్లీకి రావద్దు: పంజాబ్ సీఎం

వారు మాత్రం అసెంబ్లీకి రావద్దు: పంజాబ్ సీఎం
పంజాబ్ లో ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రాష్ట్రంలో 29 మంది ఎమ్మెల్యేకు కరోనా సోకిన విషయం తెలిసిందే.

పంజాబ్ లో ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రాష్ట్రంలో 29 మంది ఎమ్మెల్యేకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే, కరోనా బారినపడిన ఎమ్మెల్యేలు, మంత్రులతో సన్నిహితంగా మెలిగిన సభ్యులు ఎవరూ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావద్దని సీఎం అమరీందర్ సింగ్ విజ్ఞ‌ప్తి చేశారు. ముందుగా సమావేశాలకు హాజరయ్యే సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఇటీవల ధర్నాలు నిర్వహించిన ఆప్ ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ధ‌ర్నాలు వంటి కార్య‌క్ర‌మాల‌కు రాజ‌కీయ పార్టీలు దూరంగా ఉండాల‌ని సూచించారు. రాబోయే వారాల్లో రాష్ట్రంలో క‌రోనా కేసులు భారీగా పెర‌గ‌నున్నాయ‌ని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story