భగ్గుమంటున్న పెట్రో ధర

భగ్గుమంటున్న పెట్రో ధర
X
దేశంలో పెట్రో ధర భగ్గుమంటుంది. వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.

దేశంలో పెట్రో ధర భగ్గుమంటుంది. వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజువారీ స‌మీక్ష‌లో భాగంగా పెట్రోల్ ధ‌ర‌ను పెంచుతూ ప్ర‌భుత్వ‌రంగ చ‌మురు కంపెనీలు నిర్ణ‌యం తీసుకున్నాయి. దీంతో దేశంలోని మెట్రో న‌గ‌రాల్లో పెట్రోల్ ధ‌ర 9 నుంచి 10 పైసలు పెరిగింది. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.81.83కు చేరింది. బుధవారం రూ.81.73గా ఉంది. అయితే డీజిల్ ధ‌ర‌ల‌ను య‌థాత‌థంగా ఉంచాయి చమురు కంపెనీలు. డీజిల్ ధ‌ర‌లో ఎలాంటి మార్పులేదు. ప్ర‌స్తుతం లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.73.56గా ఉంది. ఇక కోల్‌క‌తాలో పెట్రోల్‌ రూ.83.33, డీజిల్ రూ.77.06 గా ఉంది. ముంబైలో పెట్రోల్‌ రూ.88.48, డీజిల్ రూ.80.11, చెన్నైలో పెట్రోల్‌ రూ.84.82, డీజిల్ రూ.78.86గా ఉంది.

Tags

Next Story