రెండు బస్సులు ఢీ.. ఆరుగురు దుర్మరణం

X
By - Admin |26 Aug 2020 11:48 AM IST
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొనడంతో ఈ దారుణం జరిగింది. బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్రంగా గాయలయ్యాయి. లక్నో-హర్దోయ్ రహదారిలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, యూపీ రోడ్‌వేస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com