నటి శరణ్య ఇంట విషాదం

నటి శరణ్య ఇంట విషాదం
తెలుగు, తమిళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన శరణ్య ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి, ప్రముఖ

తెలుగు, తమిళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన శరణ్య ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి, ప్రముఖ మలయాళ దర్శకుడు ఆంటోనీ భాస్కర్ రాజ్ (95) గుండెపోటుతో మరణించారు. చెన్నైలోని విరుగంబక్కమ్ లో కూతురు శరణ్య ఇంట్లో ఉన్న ఆయనకు ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. దర్శకుడి మరణం పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కాగా, భాస్కర్ రాజ్ 70కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. తొలుత శ్రీలంకలో దర్శకుడిగా తన కెరీర్ ను ఆరంభించినా ఆ తరువాత మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అక్కడ స్టార్ హీరోలతో చిత్రాలు నిర్మించి అక్కడి నుంచి తమిళంలోనూ చాలా చిత్రాలు చేశారు.

Tags

Next Story