నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణపై కేంద్రం..

నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణపై కేంద్రం..
నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణపై ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి

నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణపై ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మరో మారు ఓ కీలక ప్రకటన చేశారు. ఆయా పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. పరీక్షలకు సంబంధించి మొత్తం 8.58 లక్షల అడ్మిట్ కార్డులకు గాను 7.5 లక్షల అడ్మిట్ కార్డులను అభ్యర్ధులు డౌన్ లోడ్ చేసుకున్నారని.. అదే విధంగా నీట్ పరీక్షకు సంబంధించి 15.97 లక్షల అభ్యర్థులకు గాను 10 లక్షల మంది అడ్మిట్ కార్డులను అభ్యర్ధులు 24 గంటల్లో డౌన్ లోడ్ చేసుకున్నారని మంత్రి చెప్పారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సుముఖంగా ఉన్న విషయం దీన్ని బట్టి అర్థమవుతోందని రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. విద్యార్థులు ఎంపిక చేసుకున్న ప్రకారమే వారికి పరీక్షా కేంద్రాన్ని కేటాయించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story