Suicide : నిజామాబాద్‌లో వైద్య విద్యార్థి ఆత్మహత్య

Suicide : నిజామాబాద్‌లో వైద్య విద్యార్థి ఆత్మహత్య
X

నిజామాబాద్‌లో వైద్య విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. హర్ష అనే విద్యార్థి హస్టల్ గదిలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. విద్యార్థి ఆత్మహత్యతో కళాశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెడికల్ కళాశాలకు చేరుకున్న కుటుంబ సభ్యులు.. కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక తమ కుమారుడు మెరిట్ స్టూడింట్ అని.. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని మృతుడి తల్లి రాధ అన్నారు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని.. రాత్రే తనతో మాట్లాడినట్లు తెలిపారు.

మరోవైపు హర్ష ఆత్మహత్యపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని కళాశాల ప్రిన్సిపాల్ ఇందిర తెలిపారు. హర్షాకు అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. అన్ని పరీక్షల్లో మంచి మార్కులు సాధించాడని.. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదన్నారు. ఇక ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్ ఆరా తీశారు. ప్రిన్సిపాల్ నుంచి విరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక హర్షాది మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం చింతగూడ గ్రామంగా తెలుస్తోంది.

Next Story