ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించాల్సిందే: సుప్రీం కోర్టు

ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించాల్సిందే: సుప్రీం కోర్టు
ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పరీక్షలు రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది.

ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పరీక్షలు రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది. పరీక్షలు రాయకుండా ప్రమోట్ చేయకూడదని స్ఫష్టం చేసింది. సెప్టెంబర్ 30న ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించాల్సిందేనని తేల్చి చెప్పింది. కరోనా నేపథ్యంలో విద్యార్థులందరికీ పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఫైనల్ సెమిస్టర్ విద్యార్థలకు మాత్రం పరీక్షలు సెప్టెంబర్ 30 నుంచి నిర్వహిస్తామని యూజీసీ ప్రకటించింది. అయితే, ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు కూడా పరీక్షలు రద్దు చేయాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మహారాష్ట్ర శివసేన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రేకు చెందిన యువసేనతో సహా పలు సంఘాలు ఈ విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. కరోనా వైరస్‌ కారణంగా విద్యాసంస్థలు మూసి వేశారని.. ఇలాంటి పరిస్థితులోల​ పరీక్షలు పెడితే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని పిటిషన్‌దారులు కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు యూజీసీ తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది.

Tags

Read MoreRead Less
Next Story