యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో మరో ట్విస్ట్

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సీబీఐ విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసుతో ముడిపడిన పలువురిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ స్నేహితురాలు నటి రియా చక్రవర్తిని, ఆమె సోదరుడిని సోమవారం సీబీఐ అధికారులు విచారించారు.
ఈ నేపథ్యంలో రియా చక్రవర్తిపై నార్కోటిక్ కంట్రోల్ బోర్డు (ఎన్సీబీ) బుధవారం క్రిమినల్ కేసు నమోదు చేసింది. నిషేధిత మాదకద్రవ్యాల కోసం డ్రగ్స్ డీలర్లతో వాట్సాప్‌లో సంభాషించారన్న ఆరోపణలపై ఆమెతోపాటు మరికొంతమందిపై కేసు నమోదుచేసినట్టు ఎన్సీబీ అధికారులు తెలిపారు. అయితే ఈ ఆరోపణలను రియా న్యాయవాది తోసిపుచ్చారు. రియాకు డ్రగ్స్ అలవాటు లేదని, ఏ పరీక్షలకైనా సిద్ధమన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com