Telangana BJP : అష్టదిగ్బంధంలో బొమ్మలరామారం

బొమ్మలరామారం పోలీసుల అష్టదిగ్బంధంలోకి వెళ్లిపోయింది. బొమ్మలరామారం వైపు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. నాలుగువైపులా పోలీసులను మోహరించారు. RTC బస్సులు సహా ఏ వాహనాన్ని అనుమతించడం లేదు. గ్రామస్థుల వాహనాలను సైతం అడ్డుకుంటున్నారు. మరోవైపు పోలీస్ స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు తరలివస్తున్నారనే... సమాచారంతో బొమ్మలరామారాన్ని దిగ్బంధించారు పోలీసులు. మీడియా వాహనాలను సైతం అనుమతించడం లేదు. మరోవైపు తమను ఎందుకు ఆపుతున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు స్థానికులు. మరోవైపు ... బీజేపీ లీగల్ టీం ప్రతినిధుల్ని సైతం బొమ్మాలరామారం రాకుండా ఆపేశారు. పోలీస్ స్టేషన్‌కు 3 కి.మీల దూరంలోనే వీరిని నిలిపివేశారు. పోలీసుల తీరుపై మండిపడుతుతున్నారు బీజేపీ లీగల్ టీం సభ్యులు. కేసీఆర్ ప్రభుత్వం, పోలీసుల అమానుష చర్యలపై... న్యాయ పోరాటం చేస్తామన్నారు బీజేపీ నేతలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com