అందరికీ భూములను అదే విధంగా ఇస్తారా: హైకోర్టు

అందరికీ భూములను అదే విధంగా ఇస్తారా: హైకోర్టు
టాలీవుడ్ డైరెక్టర్ శంకర్ కు స్టూడియో నిర్మించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన భూములపై హైకోర్టు ఈ రోజు విచారణ

టాలీవుడ్ డైరెక్టర్ శంకర్ కు స్టూడియో నిర్మించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన భూములపై హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. ఈ విచారణలో హైకోర్టు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. రూ.2.5 కోట్ల భూమిని రూ.25 లక్షలకే ఎలా కేటాయిస్తారు అని సర్కార్ ను హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తరపు న్యాయవాది.. తెలంగాణ ఉద్యమంలో శంకర్ కీలక పాత్ర పోషించారని వివరించారు. దానికి హైకోర్టు అయితే తెలంగాణ కోసం త్యాగం చేసిన వేల మందికి ఈ విధంగానే తక్కువ ధరకు భూములు ఇస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Tags

Read MoreRead Less
Next Story