TS : మహిళా వ్యాపారులకు సింగిల్ విండో విధానం : మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో మహిళా వ్యాపారులకు సింగిల్ విండో విధానం అమలు చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. హోటల్ తాజ్ కృష్ణాలో వీ హబ్ 5వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని వీ హబ్ ప్రతినిధులకు విషెష్ తెలిపారు. వీ హబ్ నుంచి స్త్రీ నిధి కింద మహిళలకు రుణాలు అందిస్తున్నామని తెలిపారు. 750 కోట్లు వడ్డీ లేని రుణాలు విడుదల చేస్తున్నామని, యువత ఎందుకు వ్యాపారవేత్తలు అవ్వకూడదు..? అని ప్రశ్నించారు. ప్రతీ పారిశ్రామిక పార్కులో 10 శాతం ప్లాట్స్ మహిళలకు కేటాయించామని తెలిపారు.
స్త్రీ, పురుషులకు సమానంగానే ప్రతిభ ఉంటుంది అని కేటీఆర్ తెలిపారు. మానవ వనరులు, సాంకేతికతను వినియోగించుకుంటే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. అమ్మాయిలు వ్యాపార రంగంలో రాణించాలని, ప్రతి తల్లిదండ్రులు అమ్మాయిలకు ఇష్టమైన చదువును చదివించాలని. వారు ఫెయిల్యూర్ అయినా కూడా తల్లిదండ్రులు.. వెన్నుతట్టి ప్రోత్సహించాలని. అప్పుడే అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించగలుగుతారు అని కేటీఆర్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

