TS : సీఎం కేసీఆర్ వల్లే సింగరేణి అప్పుల్లో ఉంది : ఈటల

కేసీఆర్ సర్కార్‌పై ఫైర్ అయ్యారు బీజేపీ నేత ఈటల రాజేందర్. జయశంకర్ భూపాలపల్లిలో జరిగిన బీజేపీ కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న ఈటల... నిల్వ నిధులతో ఉన్న సింగరేణి ఇప్పుడు అప్పుల్లో ఉందని అన్నారు. కేసీఆర్ పిచ్చి పనులతో సింగరేణి భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. రాష్ట్రంలో యవతను మద్యానికి బానిసలుగా మార్చేస్తున్నారని,ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు ఈటల. మరోవైపు సింగరేణిని ప్రైవేట్‌పరం చేసే ఉద్దేశం కేంద్రానికి లేదని క్లారిటీ ఇచ్చారు.
మరోవైపు.. రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు బీజేపీ నాయకులు. అందులో భాగంగా కార్నర్ మీటింగ్స్‌పై బండి సంజయ్ సమీక్ష చేశారు.రెండ్రోజుల క్రితం రాష్ట్రనేతలతో సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ సమావేశమై.... కార్నర్ మీటింగ్‌ల టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశించారు. కార్నర్ మీటింగ్‌లతోనే యూపీలో మళ్లీ అధికారంలోకి వచ్చామని, పశ్చిమబెంగాల్లోనూ ఈ ప్లాన్ సక్సెస్ అయిందని తెలిపారు బన్సల్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com