TS : ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్‌ తీవ్ర అసహనం

TS : ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్‌ తీవ్ర అసహనం

మరోసారి ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కేసీఆర్‌ సమావేశం హాట్‌ హాట్‌గా జరిగింది.. ప్రజల్లోకి వెళ్లకుండా పైపై ప్రచారాలు చేస్తున్నారంటూ కొందరు ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పైపై ప్రచారాలను పక్కన పెట్టాలని సూచించారు.. హైదరాబాద్‌, నల్గొండ జిల్లాల్లోని పలువురు ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది.. పలుమార్లు సూచనలు చేసినా వైఖరి మారకుంటే టికెట్లు ఇవ్వడం కుదరదన్నారు.. పథకాల ప్రచారంపై ఫోకస్‌ చేయాలన్నారు.. నెలలో 21 రోజులు ప్రతి ఎమ్మెల్యే జనంలోనే ఉండాలన్నారు.. పార్టీ అధిష్ఠానం ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరు గమనిస్తూనే ఉంటుందన్నారు.. కర్నాటక ఫలితాలను పట్టించుకోవద్దని.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనితీరుపై చర్చ జరపాలని సూచించారు.. సర్వేలన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయని, 103 సీట్లు రాబోతున్నాయని సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేలతో చెప్పారు.. అటు సమావేశం మధ్యలోనే పలువురు ఎమ్మెల్యేలు వెళ్లిపోయినట్లు సమాచారం.. టికెట్ల అంశంపై మాట్లాడుతూ హైదరాబాద్‌ పరిధిలోని ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ కోట్‌ చేసినట్లు తెలుస్తోంది.. ఎన్నికల సమయానికి లోపాలను సరిదిద్దుకోవాలని సూచించారు.. హైదరాబాద్‌ పరిధిలో ఆత్మీయ సమ్మేళనాలు ఆశించిన మేరకు జగరడం లేదన్నారు.. విభేదాలు, విమర్శలు పక్కన పెట్టి గ్రౌండ్‌ వర్క్‌ చేసుకోవాలని ఎమ్మెల్యేలకు, సీఎం కేసీఆర్‌ క్లాస్‌ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story