TSPSC పేపర్ లీక్ పై భగ్గుమంటున్న విపక్షాలు

TSPSC పేపర్ లీక్ పై భగ్గుమంటున్న విపక్షాలు

TSPSC పేపర్ లీక్ వ్యవహారంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. సిట్టింగ్ జడ్జితోగానీ సీబీఐతో గానీ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాంపల్లి మదీనా ఎడ్యుకేషన్ సొసైటీలో అఖిలపక్ష నేతలు రౌండ్ టేబుల్ సమావేశం అయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి, కోదండరాం, ప్రోఫెసర్ విశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. పేపర్ లీక్ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించారు.

TSPSC పేపర్లను పల్లి, బఠానీల్లా అమ్ముకుంటున్నారని NSUI అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అన్నారు. కేసు బయటకు రాకుండా ఉండేందుకు ఈ కేసులో ఇద్దరే నిందితులు ఉన్నారని కేటీఆర్ అందిరిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయన్న బల్మూరి వెంకట్... విచారణపై సిట్ చెప్పకముందే కేటీఆర్ అన్ని విషయాలు ఎలా చెబుతున్నారని విమర్శించారు.

ఉద్యోగాల భర్తీలో సర్కారుకు చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ నేతలు అన్నారు. రాష్ట్రంలో లక్షల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వెంటనే వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇక నిరుద్యోగులకు యూత్ కాంగ్రెస్ అండగా ఉంటుందని... ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందన్నారు. పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఐక్య కార్యాచరణ రూపొందించాలని కోదండ రామ్‌ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎలా పోరాటం చేశామో.. ఇప్పుడు అదే స్ఫూర్తి ప్రదర్శించాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story