Uttarpradesh : సారస్ క్రేన్‌ను రక్షించిన వ్యక్తిపై కేసు

Uttarpradesh : సారస్ క్రేన్‌ను రక్షించిన వ్యక్తిపై కేసు


సారస్ క్రేన్‌ను రక్షించి ఏడాది పాటు సంరక్షణ చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తిపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసారు. అమేథీ జిల్లాలోని మంద్ఖా గ్రామంలో ఆరిఫ్ ఖాన్ గుర్జార్‌తో కలిసి నివసించిన క్రేన్‌ను అతనితో పాటు అతని పొలాలకు తీసుకెళ్లేవాడు. క్రేన్ ను "కుటుంబ సభ్యుడిలా" చూసుకున్నారు. మార్చి 21 న అటవీ శాఖ అధికారులు తీసుకెళ్లారు. పక్షి తన సహజ వాతావరణంలో జీవించేందుకు వీలుగా రాయ్‌బరేలీలోని సమస్పూర్ అభయారణ్యంలోకి మార్చినట్లు అధికారులు తెలిపారు. శనివారం ఆరిఫ్ ఖాన్ గుర్జార్‌కు నోటీసు జారీ చేసిన డిపార్ట్‌మెంట్ అతని స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి ఏప్రిల్ 4న గౌరీగంజ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కార్యాలయంలో హాజరు కావాలని కోరింది. అసిస్టెంట్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (గౌరీగంజ్) రణవీర్ సింగ్ జారీ చేసిన నోటీసు ప్రకారం, వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేయబడింది.

పక్షిని తీసుకెళ్లిన ఒక రోజు తర్వాత, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా అటవీ శాఖ చర్యను ఖండించారు. ప్రధాని నివాసంలో ఉన్న నెమళ్లను తీసుకెళ్లే ధైర్యం ఎవరికైనా ఉందా అని పరోక్షంగా ప్రశ్నించారు. ఆరీఫ్ ఖాన్ గుర్జార్ మాజీ ముఖ్యమంత్రితో కలిసి వేదికపై కూర్చున్నారు కానీ మాట్లాడలేదు.

అకిలేష్ యాదవ్ ఆరోపణలపై డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ DN సింగ్ స్పందిస్తూ, "ఏ చర్య తీసుకున్నా ఆరిఫ్ సమ్మతితోనే" అని చెప్పారు. ఈ పక్షులు ఎప్పుడూ జంటలుగా జీవిస్తాయని తెలిపారు. క్రేన్ ఒంటరిగా నివసిస్తున్నందున, దాని శ్రేయస్సు గురించి కొంత భయము ఉన్నట్లు పేర్కొన్నారు.


Next Story