YSRTP ఖమ్మం జిల్లా అధ్యక్షుడు రాజీనామా

YSRTP ఖమ్మం జిల్లా అధ్యక్షుడు రాజీనామా

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్ రాజీనామా చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. తనకు ముందునుంచి వైఎస్ఆర్ కుటుంబంపై అభిమానం ఉందని అన్నారు. వైఎస్ షర్మిల నాయకులకు దిశానిర్దేశం చేయడంలో విఫలం అయ్యిందని ఆరోపించారు. నిజాయితీగా పని చేసేవారికి పార్టీలో విలువలేదని అన్నారు. సతీశ్ అనే వ్యక్తి తనకు జిల్లా అధ్యక్షుడి పదవి రాకుండా అడ్డుపడ్డాడని,ఎన్నో ఇబ్బందులకు గురిచేశాడని తెలిపారు. వైఎస్ విగ్రహాలు ఖమ్మంలో తీసివేసినా షర్మిల కనీసం స్పందించలేదని అన్నారు. వైఎస్ వివేకా కేసులో సునితను షర్మిల టార్గెట్ చేయడం సరికాదన్నారు. ఇదిలా ఉంటే షర్మిల నేడు ఖమ్మంలోనే పర్యటించారు.

Tags

Read MoreRead Less
Next Story