ఎస్పీకి ఎక్మో సాయంతో చికిత్స

ఎస్పీకి ఎక్మో సాయంతో చికిత్స
ఎస్పీ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండడంతో వెంటిలేటర్ పై ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న కరోనా లక్షణాలతో చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో జాయినై చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వెంటిలేటర్ పై ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, అంతర్జాతీయ వైద్య నిపుణులతో అనుసంధానమై ఎస్పీకి చికిత్స అందిస్తున్నారు. యూకే, యూఎస్ లోని కరోనా రోగులకు అక్కడి వైద్యులు ఎక్మో సాయంతో చికిత్స అందించారు. ఎస్పీ ఆరోగ్యం మెరుగుపడేందుకు ఎంజిఎం వైద్యులు అందిస్తున్న చికిత్సా విధానంపై అంతర్జాతీయ వైద్యులు సంతోషం వ్యక్తం చేశారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Tags

Read MoreRead Less
Next Story