అన్నయ్య కానుక అపురూపం: మెగాస్టార్

X
By - Admin |23 Aug 2020 3:42 PM IST
చిరకాల మిత్రుడు చిరంజీవికి డైలాగ్ కింగ్ మోహన్ బాబు పుట్టినరోజు కానుకగా ఓ స్పెషల్ గిప్ట్ అందించారు. మెగాస్టార్ 65వ
చిరకాల మిత్రుడు చిరంజీవికి డైలాగ్ కింగ్ మోహన్ బాబు పుట్టినరోజు కానుకగా ఓ స్పెషల్ గిప్ట్ అందించారు. మెగాస్టార్ 65వ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనకు కొయ్యతో చేసిన బుల్లెట్ ను కానుకగా పంపించారు. శనివారం చిరంజీవి తన 65వ పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా బంధువులు, మిత్రులు, రాజకీయప్రముఖులు, శ్రేయోభిలాషులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు అందజేశారు. మోహన బాబు తనకు పంపిన కానుకను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన చిరంజీవి.. నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టినరోజు నాడు ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి. థ్యాంక్యూ మోహన్ బాబు అని మెగాస్టార్ ట్విట్టర్ లో మెసేజ్ పెట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com