నేను సీఎం అభ్యర్థిని కాదు: రంజన్ గగోయ్
రానున్న అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థి భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారం అబద్దం అని గగోయ్ అన్నారు. తాను రాజకీయ నేతను కాదని.. అలాంటి కోరిక తనకు లేదని ఆయన స్ఫష్టం చేశారు. రాజ్యసభకు తాను నామినేటెడ్ సభ్యుడునేనని.. ఏ పార్టీ తరుపున హౌస్ లోకి ప్రవేశించలేదని ప్రజలు తెలుసుకోవాలని అన్నారు.
తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం కోసం రాజ్యసభలో నామినేటెడ్ సభ్యుడిగా ఉండాలనుకున్నానని ఆయన తెలిపారు. అలా ఉన్నంత మాత్రానా తనను రాజకీయ నాయకుడిగా చూడటం సరికాదని అన్నారు. కాగా.. వచ్చే ఏడాది అసోం అసెంబ్లీ ఎన్నికల్లో రంజన్ గగోయ్ బీజేపీ తరుపున సీఎం అభ్యర్థికావచ్చని కాంగ్రెస్ మాజీ సీఎం తరుణ్ గగోయ్ అన్నారు. రామమందిర తీర్పు బీజేపీకి అనుకూలంగా ఉండటంతో.. ఆయన రాజ్యసభకు వెళ్లారని తరుణ్ గగోయ్ అన్నారు. రాజ్యసభకు బీజేపీ నామినేట్ చేస్తే.. ఆయన ఆమోదించడం చూస్తే.. ఆయన క్రియాశీలక రాజకీయాల పట్ల ఆసక్తితో ఉన్నారని తరుణ్ గగోయ్ అభిప్రాయపడ్డారు. అయితే, తరుణ్ గగోయ్ వ్యాఖ్యలను రంజన్ గగోయ్ ఖండించగా.. అటు, బీజేపీ కూడా ఈ వ్యాఖ్యలు అర్థరహితం అని తెలిపింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com