సోమవారం సీడబ్ల్యూసీ భేటీ
By - Admin |24 Aug 2020 3:05 AM GMT
సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. ఈ భేటీలో ప్రధానంగా మూడు అంశాలపైనే చర్చ జరుగనున్నట్లు సమాచారం.
సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ఉదయం సమావేశం జరుగనుంది. ఈ భేటీలో ప్రధానంగా మూడు అంశాలపైనే చర్చ జరుగనున్నట్లు సమాచారం. పార్టీ అధ్యక్ష బాధ్యతలు, పార్టీ కేంద్ర కార్యాలయం మార్పు, కొత్త కమిటీల నియామకం వంటి కీలక అంశాలపై చర్చించేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్, శశిథరూర్, మాజీ ముఖ్యమంత్రులు భూపిందర్‌సింగ్ హుడా, పృథ్విరాజ్ చవాన్‌తో పాటు 20 మందికిపైగా ఎంపీలు లేఖలో సంతకాలు చేసినట్లు సమాచారం.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com