కేరళలో విజయన్‌ సర్కార్‌పై అవిశ్వాసం..

కేరళలో విజయన్‌ సర్కార్‌పై అవిశ్వాసం..
X
కేరళలోని పినరయి విజయన్ సర్కార్‌పై ప్రతిపక్ష కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది.

కేరళలోని పినరయి విజయన్ సర్కార్‌పై ప్రతిపక్ష కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. కేరళ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వీడీ సతీసన్ సర్కార్‌కి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంపై నోటీసు ఇచ్చారు. దీంతో అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ అనుమతి ఇచ్చారు. కాగా, అవినీతి ఆరోపణలు, బంగారం స్మగ్లింగ్ కేసు నేపథ్యంలో సీఎం పినరయ్ విజయన్‌ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

కరోనాపై చర్చించడానికి కేరళ అసెంబ్లీ సోమవారం ఒక్క రోజు సమావేశమైంది. అయితే అవిశ్వాసంపై చర్చించడానికి సుమారు రెండు రోజుల పాటు సమయం కావాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

Tags

Next Story