ధోనీపై ప్రేమతో చేనేత వస్త్రకారులు..

ధోనీపై ప్రేమతో చేనేత వస్త్రకారులు..
చెన్నైకి చెందిన చేనేత వస్త్రకారులు తమ అభిమాన క్రికెటర్ ధోనీ చిత్రంతో కూతురు జీవా చిత్రాన్ని కూడా దుప్పటి మీద నేసి ఆయన..

చెన్నైకి చెందిన చేనేత వస్త్రకారులు తమ అభిమాన క్రికెటర్ ధోనీ చిత్రంతో కూతురు జీవా చిత్రాన్ని కూడా దుప్పటి మీద నేసి ఆయనకు బహుమతిగా అందజేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచి సెంటెక్స్ పేరుతో చెన్నిమలై కేంద్రంగా చేనేత వస్త్రాలు తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తోంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో 30కి పైగా చేనేత సహకార సంఘాలు పని చేస్తున్నాయి. ఇక్కడి కళాకారులు తయారు చేసే వస్త్రాలకు ఆధునిక హంగులు అద్ది ఇప్పటి యువతకు నచ్చే రీతిలో వస్త్రాలు నేస్తారు. ప్రముఖుల చిత్రాలు నేసి సందర్భం వచ్చినప్పుడు వారికి అందజేస్తుంటారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, మధర్ థెరిస్సా, ముఖ్యమంత్రి జయలలిత, కరుణానిధి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఫోటోలు ముద్రించి దుప్పట్లు తయారు చేశారు. ఈ నేపథ్యంలో ధోనీ తన కుమార్తెతో ముచ్చటిస్తున్న చిత్రాన్ని ముద్రించి ఐపీఎల్ సమయంలో ఆయనకు అందజేయాలని భావిస్తున్నారు.

Read MoreRead Less
Next Story