అందరికీ అనువైన హెల్త్‌కేర్‌ పాలసీ: ఉపాసన

అందరికీ అనువైన హెల్త్‌కేర్‌ పాలసీ: ఉపాసన
X
ఆరోగ్యబీమా పాలసీలు అనారోగ్య సమయంలో ఆపద్భాందవుల్లా ఆదుకుంటాయి. ఏ చిన్నపాటి అనారోగ్యం చేసినా కార్పొరేట్ ఆస్పత్రికి..

ఆరోగ్యబీమా పాలసీలు అనారోగ్య సమయంలో ఆపద్భాందవుల్లా ఆదుకుంటాయి. ఏ చిన్నపాటి అనారోగ్యం చేసినా కార్పొరేట్ ఆస్పత్రికి వెళితే బిల్లులు వాచిపోతుంటాయి. కరోనా వైరస్ ప్రభావంతో దాదాపుగా అందరిలో ఆరోగ్య స్పృహ పెరిగింది. దీంతో హెల్త్ పాలసీలు తీసుకునే వారి సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ కోడలు ఉపాసన ఓ వినూత్న ఆలోచనకు ప్రయత్నాలు ప్రారంభించారు. బీమా కంపెనీలు, ప్రభుత్వంతో కలిసి మధ్య తరగతి వారికి ఉపయోగపడే విధంగా హెల్త్‌కేర్‌ పాలసీని తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఆమె ట్విట్టర్ లో ప్రస్తావించారు. 50 కోట్ల మంది భారతీయులకు అనువైన హెల్త్‌కేర్‌ పాలసీని అభివృద్ధి చేయడానికి బీమా సంస్థలు, ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి తమ వైపు నుంచి సంపూర్ణ మద్ధతు ఉంటుందని ఉపాసన పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా 50 కోట్ల మంది భారతీయులు పేదరికంలోని నెట్టివేయబడుతున్నారు. అందరికీ అనువుగా ఉండేలా సరికొత్త పాలసీని ఒకటి తీసుకురావాలని భావిస్తున్నాం అని ఉపాసన ఇన్సూరెన్స్ కంపెనీ ఎఫ్‌హెచ్‌పీఎల్‌ని ట్యాగ్ చేశారు. 65 లక్షల మందికి ఆరోగ్య సేవలను కల్పించే ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ లో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందని ఉపాసన అన్నారు.


Tags

Next Story