హర్యానా స్పీకర్‌కు కరోనా పాజిటివ్

హర్యానా స్పీకర్‌కు కరోనా పాజిటివ్
X
హర్యానా అసెంబ్లీ స్పీకర్ జియాన్‌ చంద్‌ గుప్తాకు కరోనా సోకింది. చంద్‌ గుప్తాతో సహా మరో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు కరోనా..

దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. ఇక హర్యానాలో కరోనా మమమ్మారి కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. సామన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ మహమ్మారి ఎవరినీ వదలటం లేదు. తాజాగా హర్యానా అసెంబ్లీ స్పీకర్ జియాన్‌ చంద్‌ గుప్తాకు కరోనా సోకింది.

చంద్‌ గుప్తాతో సహా మరో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అనిల్‌ విజ్‌ సోమవారం తెలిపారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు స్పీకర్‌కు వైరస్‌ సోకిందన్నారు. ఆరుగురు అసెంబ్లీ సిబ్బందికి కూడా కరోనా వచ్చింది.

Tags

Next Story