భగ్గుమంటున్న పెట్రోల్‌ ధర

భగ్గుమంటున్న పెట్రోల్‌ ధర
దేశంలో పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. వినియోగదారుల జేబులకు చిల్లులు పడేలా ప్రతి రోజు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి.

దేశంలో పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. వినియోగదారుల జేబులకు చిల్లులు పడేలా ప్రతి రోజు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. వరుసగా 5వ రోజు పెట్రోల్ ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వరుసగా ఐదో రోజు సోమవారం పెట్రోల్‌ ధరను పెంచాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర 14 పైసలు పెంచాయి. ఇక ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో 13 పైసలు పెంచాయి. ముంబై, చెన్నై, కోల్‌కతాల్లో 12 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.84.83కు పెరిగింది. ఢిల్లీలో రూ.81.62, ముంబైలో రూ.88.28గా రికార్డయింది.

Tags

Read MoreRead Less
Next Story