సెప్టెంబర్ ఒకటి నుంచి మెట్రో పరుగులు?

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో గత మార్చి నెల చివరి నుంచి దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. అయితే అన్‌లాక్ 4 మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం మరిన్ని సడలింపులు ఇవ్వాలని భావిస్తోంది. అందులో భాగంగా.. సెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో రైలు సేవలకు అనుమతినివ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అగస్టు నెలాఖరు లోపు ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మెట్రో రైలు సేవలను తిరిగి ప్రారంభించేందుకు తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉంటుంది.
జూలై 30 న వచ్చిన అన్‌లాక్ 3 మార్గదర్శకాలు రాత్రి కర్ఫ్యూను ముగించాయి. అలాగే, కంటైన్మెంట్ జోన్లలో లేని యోగా ఇన్స్టిట్యూట్‌లను ప్రారంభించడానికి అనుమతించాయి. విద్యాసంస్థలు, పబ్లిక్ పార్కులు లేదా సినిమా హాళ్ళు, పెద్ద సమావేశాలు జరిగే అన్ని ఇతర ప్రాంతాలలో పరిమితులు అమలులో ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com