ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో రాజస్థాన్ లో అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు మూడు రోజుల పాటు పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. అరేబియా, బంగాళాఖాతం తీరప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణకేంద్రం అధికారులు తెలిపారు.

అల్పపీడన ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌తో పాటు పశ్చిమబెంగాల్, గుజరాత్, బీహార్, రాజస్థాన్, ఒడిశా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, చత్తీస్ ఘడ్, జార్ఖండ్, అసోం, మేఘాలయ, మధ్యమహారాష్ట్ర, కంకణ్, గోవా, యానాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, మహారాష్ట్రాలలో భారీవర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story