హర్యానా కేబినెట్ మంత్రికి కరోనా పాజిటివ్

హర్యానా కేబినెట్ మంత్రికి కరోనా పాజిటివ్
X
హర్యానా రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కు కరోనా సోకిన రెండో రోజే అతని కేబినెట్ మంత్రి మూల్ చంద్ శర్మకు కరోనా సోకింది

దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇక హర్యానాలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. ప్రతిరోజు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ కరోనా మహమ్మారి సామన్యుల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు ఎవరినీ వదలటం లేదు. తాజాగా హర్యానా కేబినెట్ మంత్రికి కరోనా సోకింది. కేబినెట్ మంత్రి మూల్ చంద్ శర్మకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది.

హర్యానా రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కు కరోనా సోకిన రెండో రోజే అతని కేబినెట్ మంత్రి మూల్ చంద్ శర్మకు కరోనా సోకింది. తనకు కరోనా సోకిందని హర్యానా రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మూల్ చంద్ శర్మ మంగళవారం ట్వీట్ చేశారు. తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి మూల్ చంద్ కోరారు.

Tags

Next Story