సెప్టెంబర్ 2న తెలంగాణ పాలిసెట్

సెప్టెంబర్ 2న తెలంగాణ పాలిసెట్
X
తెలంగాణలో సెప్టెంబర్ 2న పాలిసెట్‌ను నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటలవరకు పరీక్ష నిర్వహించనున్నారు.

తెలంగాణలోని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం పాలిసెట్‌ను నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యామండలి కార్యదర్శి సీ శ్రీనాథ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 2న పాలిసెట్‌ను నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటలవరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇక సెప్టెంబర్ 6న ఎల్పీసెట్‌ (లాటరల్‌ ఎంట్రీ కోసం)ను నిర్వహించనున్నారు. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అనుమతితో ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించామని సీ శ్రీనాథ్‌ పేర్కొన్నారు.

Tags

Next Story