రూ. 2.5 కోట్లు పలికిన మహాత్మాగాంధీ కళ్లజోడు

రూ. 2.5 కోట్లు పలికిన మహాత్మాగాంధీ కళ్లజోడు
మహాత్మాగాంధీకి చెందిన ఓ కళ్లజోడు వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికింది. ఈ కళ్లజోడు వేలంలో రూ.2.5కోట్లు పలికింది.

మహాత్మాగాంధీకి చెందిన ఓ కళ్లజోడు వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికింది. ఇంగ్లండ్‌లోని ఈస్ట్ బ్రిస్టోల్ ఆక్షన్స్ సంస్థ మహాత్ముడుకి చెందిన కళ్లజోడును వేలం వేసింది. ఈ కళ్లజోడు వేలంలో రూ.2.5కోట్లు పలికింది. ఈస్ట్ బ్రిస్టోల్ ఆక్షన్స్ సంస్థ లెటర్ బాక్సుకు వేలాడుతూ ఈ కళ్లజోడు కనిపించిందట. గతంలో సౌతాఫ్రికాలో పనిచేసిన ఓ వ్యక్తి వీటిని సేకరించాడు. వంశపారంపర్యంగా తనకు వచ్చిన ఈ కళ్లజోడును ఇంగ్లండ్‌కు చెందిన వ్యక్తి బ్రిస్టోల్ ఆక్షన్స్‌కు పంపించాడు.

గతంలో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా ఒకటి వేలంలో మంచి ధర పలికింది. ఈ చరఖా 2013లో వేలంపాటలో రూ. కోటి ధర పలికింది. లండన్‌లో నిర్వహించిన ఈ వేలంపాట అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా మహాత్ముడి కళ్లజోడు వేలంలో రూ.2.5 కోట్లు పలికింది. అయితే వేలంలో కనీసం 15వేల యూరోలు (రూ.15లక్షలు) పలుకుతుందని నిర్వాహకులు భావించారట. అయితే అనూహ్యంగా ఇది 2.6లక్షల యూరోలు (సుమారు రూ.2.5కోట్లు) పలికింది.

Tags

Read MoreRead Less
Next Story