నాలుగు నెలల్లో 40లక్షల కొత్త ట్రేడింగ్ ఖాతాలు

నాలుగు నెలల్లో 40లక్షల కొత్త ట్రేడింగ్ ఖాతాలు
గడిచిన నాలుగు నెలల్లో కొత్తగా 40లక్షల 15వేల ట్రేడింగ్ ఖాతాలు తెరిచారు. మొత్తం సంఖ్య 4కోట్ల 43 లక్షలకు చేరింది.

ఒకప్పుడు షేర్ మార్కెట్ అంటే అదో జూదం అనేవాళ్లు.. కానీ ఇప్పుడు ట్రేడింగ్ ఫ్యాషన్ అవుతోంది. యూత్ నుంచి మిడిల్ ఏజ్ వరకూ ప్రతిఒక్కరూ స్టాక్ మార్కెట్ల పట్ల ఆసక్తి చూపుతున్నారు. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ.. ఊరిస్తున్న లాభాలు వారిని మార్కెట్ వైపు మళ్లిస్తున్నాయి. గడిచిన నాలుగు నెలల్లో కొత్తగా 40లక్షల 15వేల ట్రేడింగ్ ఖాతాలు తెరిచారు. మొత్తం సంఖ్య 4కోట్ల 43 లక్షలకు చేరింది. కోవిడ్ కారణంగా ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. జాబ్స్ పోతున్నాయని నివేదికలున్నాయి. వేతనాల్లో కోతలు పెరుగుతున్నాయి. కంపెనీల్లో కాస్ట్ కటింగ్ ఉంది. అయినా పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లోకి ఇన్వెస్టర్స్ రావడం ఆశ్చర్యపరుస్తుంది. జులైలోనే దాదాపు 72శాతం ట్రేడింగ్ వాల్యూమ్ కేవలం నాన్ ఇన్ స్టిట్యుటూషనల్ స్మాల్ ఇన్వెస్టర్స్ నుంచి వచ్చింది. ఇందులో మెజార్టీ స్మాల్ వీరి పాత్రే ఎక్కువగా ఉంది.

గతంలో ట్రేడింగ్ ఖాతా తెరవాలంటే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. 70కు పైగా సంతకాలు కావాలి. బ్రోకరేజి సంస్థలకు వెళ్లాలి. డాక్యుమెంట్లు ఇవ్వాలి. తర్వాత అనుమతులు.. ఇదంతా పెద్ద తలనొప్పి. కానీ ఇప్పుడు నిమిషాల్లో ఖాతాలకు అనుమతి వస్తోంది. ఇంట్లో ఉండి eKYC ద్వారా పనైపోతుంది. దీనికి తోడు యూత్ ను ఎట్రాక్ట్ చేయడానికి సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. అంతేకాదు.. PAYTMలాంటి సంస్థలు కూడా యాప్ ల ద్వారా సేవలు అందిస్తున్నాయి. దీనికి తోడు జీరో చార్జ్ ఖాతాలు అంటూ ఆఫర్లు ఇస్తున్నాయి. ఇవన్నీ ఖాతాలు భారీగా పెరగడానికి కారణం

Tags

Read MoreRead Less
Next Story