రియల్ హీరో సూర్య.. రూ.5 కోట్ల ఆర్థికసాయం

రియల్ హీరో సూర్య.. రూ.5 కోట్ల ఆర్థికసాయం
సినిమాల్లో వాళ్లు హీరోలే.. కష్టాలకు కరిగి పోతారు.. కన్నీళ్లు పెట్టిస్తారు.. ప్రేక్షకుల దృష్టిలో హీరో అంటే అలానే ఉండాలి..

సినిమాల్లో వాళ్లు హీరోలే.. కష్టాలకు కరిగి పోతారు.. కన్నీళ్లు పెట్టిస్తారు.. ప్రేక్షకుల దృష్టిలో హీరో అంటే అలానే ఉండాలి.. నిజ జీవితంలో కూడా సినిమా హీరోలానే ఉంటే వాళ్లని అభిమానులు గుండెల్లో పెట్టుకుంటారు.. సినిమాల ద్వారా కోట్లు సంపాదించినా ఆపన్నులను ఆదుకునే మంచి మనసు కొందరికే ఉంటుంది.. తమిళ్ స్టార్ సూర్య అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా సినిమా పరిశ్రమకు చెందిన వారు చాలా మంది నష్టపోయారు. అటువంటి వారికోసం సూర్య రూ.5కోట్ల ఆర్థికసాయం చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. సూర్య నటించిన తాజా చిత్రం 'శూరరై పోట్రు'. ఈ చిత్రాన్ని తెలుగులో ఆకాశం నీ హద్దురా పేరుతో విడుదల చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 30న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా వచ్చిన మొత్తంలో రూ.5 కోట్లను ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు అందజేస్తానని సూర్య తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story