ఎండిన ఆకులో అందాల్ని దాచుకున్న సీతాకోకచిలుక.. వీడియో వైరల్
సృష్టిలో ఎన్నో వింతలు మరెన్నో అద్భుతాలు. ప్రకృతి తనలో ఎన్నో అందాలను దాచుకుంది. రంగు రంగుల సీతాకోక చిలుకలు కంటికి ఇంపైన రంగులలో అలరిస్తుంటాయి. కానీ మనం మునుపెన్నడూ చూడని ఓ వింతైన రూపంతో సీతాకోక చిలుక కనిపించే సరికి ఒకింత ఆశ్చర్యం.. మరింత సంభ్రమం.. అచ్చంగా ఎండిపోయిన ఆకులా ఉన్న సీతాకోక చిలుక రెక్కలు మూస్తే ఎండిన ఆకులా, తెరిస్తే నీలం రంగులో అద్భుతంగా కనిపిస్తోంది.
ట్విట్టర్ హ్యాండిల్ బటర్‌ఫ్లై కన్జర్వేషన్ ఆదివారం పైన పేర్కొన్న క్లిప్‌ను పోస్ట్ చేసింది. ఉష్ణమండల ఆసియాలో కనిపిస్తుంది ఈ డెడ్ లీఫ్ సీతాకోకచిలుక. ఇతర క్రిమి కీటకాలనుంచి తనని తాను రక్షించుకోవడానికి అనువుగా ఈ డెడ్ లీఫ్ సీతాకోక చిలుక తన రెక్కలను మూసివేసుకుంటుంది.
One of the most incredible examples of camouflage; the Dead Leaf butterfly of Tropical Asia.
— Butterfly Conservation (@savebutterflies) August 23, 2020
When a bird or other predator gets too close, the Dead Leaf closes its wings, rendering itself virtually invisible to the would-be killer! https://t.co/95RSkJYKaK pic.twitter.com/H7hiLbWQGE
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com