ఫ్రీ స్మార్ట్ ఫోన్.. ఇది అబద్దపు వార్త: కేంద్రం

టెక్నాలజీ, స్మార్ట్‌ఫోన్ వాడకం పెరిగిన తరువాత ఫేక్ న్యూస్, రిక్స్కీ న్యూస్ పెరిగిపోతుంది. ప్రతీ చిన్న విషయాన్ని కూడా అవకాశంగా మలుచుకొని ఫేక్ న్యూస్ సర్క్యూలేట్ చేస్తున్నారు. తాజా ఈ కరోనా సంక్షోభాన్ని కూడా అవకాశం మార్చుకొని ఓ కొత్త వార్తను ప్రచారంలోకి తెచ్చారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు స్కూల్స్, కాలేజీలు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో అన్ని విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసుల వైపు మొగ్గు చూపుతున్నాయి. అయితే, ఆన్లైన్ క్లాసులు వినడానికి ప్రతీ ఒక్కరికీ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉండవు. ఈ నేపథ్యంలో "విద్యార్థులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు అందించనుంది" అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అయితే, అక్కడితో ఆగకుండా.. ఈ వార్తకు ఓ లింక్ ను జోడించి.. స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే.. ఈ లింక్ ఓపెన్ చేసి.. అందులో వివరాలు నమోదు చేయాలని ఉంది. ఈ వార్తను చదివిన చాలా మంది ఈ విషయాన్ని ఇతరులకు షేర్ చేస్తున్నారు. అయితే, ఈ వార్తపై కేంద్రం స్పందించింది. ప్రభుత్వం ఇలాంటి ప్రకటన చేయలేదని ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేసింది. ఈ లింక్ ఓపెన్ చేయొద్దని.. అలా చేస్తే.. వ్యక్తగత వివరాలు దొంగించబడతాయని హెచ్చరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com