మహారాష్ట్రలో 7లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇక మహారాష్ట్రలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రతి రోజు 10వేల పైనే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో మహారాష్ట్రలో కరోనా కేసులు 7లక్షల మార్కును దాటాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 10,425 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 7,03,823కు చేరింది. కరోనా బారిన పడి ఒక్కరోజే 329 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు రాష్ర్టవ్యాప్తంగా కరోనా బారి నుంచి 5,14,790 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు మంగళవారం వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కాగా, ప్రస్తుతం 1,65,921మంది కరోనా సోకి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com