మహద్‌ ఘటన మరవకముందే మధ్యప్రదేశ్‌లో కూలిన భవనం

మహద్‌ ఘటన మరవకముందే మధ్యప్రదేశ్‌లో కూలిన భవనం
X
మహద్‌ ఘటనలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మధ్యప్రదేశ్‌లో భవనం కూలింది. దేవస్‌లో రెండతస్తుల భవనం కూలింది.

మహారాష్ట్రలోని మహద్‌లో సోమవారం ఐదంతస్థుల భవనం కూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 14 మంది వరకు మృతి చెందారు. మహద్‌ ఘటనలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మధ్యప్రదేశ్‌లో భవనం కూలింది. మధ్యప్రదేశ్‌లోని దేవస్‌లో రెండతస్తుల భవనం కూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది మందిని రక్షించారు. మంగళవారం దేవస్‌లోని లాల్‌గేట్‌ సమీపంలో స్టేషన్‌ రోడ్డు వద్ద రెండు అంతస్తుల భవనం కూప్పకూలింది. ఈ ఘటనలో సురక్షితంగా బయటపడ్డ వారిని అధికారులు హాస్పిటల్‌కి తరలించారు. ఇంకా సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఆపరేషన్‌ చేపడుతున్నారు.

Tags

Next Story