ఉస్సేన్ బోల్ట్ కి పాజిటివ్.. పుట్టిన రోజు పార్టీలో చేసిన హంగామా కారణంగా

ప్రపంచ రికార్డ్ స్ప్రింటర్, ఎనిమిది సార్లు ఒలింపిక్ బంగారు పతక విజేత ఉసేన్ బోల్ట్ కి కరోనా వైరస్ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. గత వారం తన 34 వ పుట్టినరోజును భారీ ఎత్తున జరుపుకున్నారు. ఈ పార్టీకి వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్, ఇంగ్లండ్ ఫుట్ బాలర్ స్టెర్లింగ్ తదితరులు హాజరయ్యారు. అనంతరం కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని జమైకాకు చెందిన ఓ రేడియో చానెల్ తెలిపింది. జమైకాలోని తన ఇంటి వద్ద స్వీయ నిర్భంధంలో ఉన్నారు. జమైకా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆలస్యంగా ధృవీకరించిన నివేదికలో ఉస్సేన్ కు కరోనా సోకిన విషయాన్ని నిర్ధారించింది.
"నేను 2020 లో ఇంట్లోనే ఉండబోతున్నాను… మళ్ళీ ప్రయాణం చేయను.. అని బోల్ట్ శనివారం సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు, ఇంటి వద్ద తనను తాను నిర్భంధించుకుంటున్నానని చెప్పాడు. ప్రస్తుతానికి అతడికి కరోనాకి సంబంధించిన లక్షణాలేవీ కనిపించలేదని తెలిపాడు.
Stay Safe my ppl 🙏🏿 pic.twitter.com/ebwJFF5Ka9
— Usain St. Leo Bolt (@usainbolt) August 24, 2020
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com