రైల్వేలో 1400 ఉద్యోగాలు.. వివిధ జోన్లలోని భర్తీల వివరాలు..

రైల్వేలో 1400 ఉద్యోగాలు.. వివిధ జోన్లలోని భర్తీల వివరాలు..

దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో ప్రస్తుతం 1400కు పైగా పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆయా రైల్వే జోన్ల వెబ్‌సైట్లలోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. మరి వాటి వివరాలేంటో ఒకసారి చూద్దాం.

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే రిక్రూట్‌మెంట్: ఆగ్నేయ మధ్య రైల్వే 462 పోస్టుల్ని భర్తీ చేయనుంది. అందులో 90 Copa, 40 స్టెనోగ్రాఫర్, 80 ఫిట్టర్, 50 ఎలక్ట్రీషియన్, 5 వైర్‌మెన్, 6 ఎలక్ట్రానిక్/మెకానిక్, 6 RAC మెకానిక్, 40 వెల్డర్, 40 ప్లంబర్, 10 మేసన్, 10 పెయింటర్, 10 కార్పెంటర్, 10 మెషినిస్ట్, 10 టర్నర్, 10 షీట్ మెటల్ వర్కర్ పోస్టులున్నాయి. దరఖాస్తు చేయడానికి జులై 15 చివరి తేదీ. ఇంటర్ లేదా ఐటీఐ పాసైనవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 15 నుంచి 24 ఏళ్లు.

సౌత్ వెస్ట్రన్ రైల్వే రిక్రూట్‌మెంట్: నైరుతి రైల్వే 117 జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, 42 స్టేషన్ మాస్టర్, 20 గూడ్స్ గార్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేయడానికి జులై 15 చివరి తేదీ. 18 నుంచి 42 ఏళ్లలోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టుకు ఇంటర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్ పోస్టులకు గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.

సెంట్రల్ రైల్వే రిక్రూట్‌మెంట్: సెంట్రల్ రైల్వే 7 జూనియర్ ఇంజనీర్/ జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తు చేయడానికి జులై 19 చివరి తేదీ. సివిల్ ఇంజనీరింగ్‌లో 4 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ, 3 ఏళ్ల డిప్లొమా లేదా బీఎస్సీ చదివిన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ రైల్వే రిక్రూట్‌మెంట్: ఈశాన్య సరిహద్దు రైల్వే మెడికల్ కేటగిరిలో 14 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. జులై 15న వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. 9 నర్సింగ్ సూపరింటెండెంట్, 2 హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్, 1 ల్యాబ్ అసిస్టెంట్, 1 ఫార్మాసిస్ట్, 1 ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి.

వెస్ట్రన్ రైల్వే రిక్రూట్‌మెంట్: పశ్చిమ రైల్వే 18 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అందులో 9లోకో ఇన్‌స్పెక్టర్ పోస్టులతో పాటు ఇతర ఖాళీలున్నాయి. దరఖాస్తు చేయడానికి జులై 12 చివరి తేదీ. 12 సీనియర్ రెసిడెంట్ పోస్టులున్నాయి. దరఖాస్తుకు జులై 11 చివరి తేదీ.

వెస్ట్రన్ రైల్వే డిపార్ట్‌మెంటల్ ఎగ్జామ్ ద్వారా టికెట్ క్లర్క్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇప్పటికే రైల్వేలో పనిచేస్తున్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 135 స్టేషన్ మాస్టర్, 100 గూడ్స్ గార్డ్, 129 సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, 238 కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, 105 జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, 18 ట్రైన్స్ క్లర్క్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుకు జులై 30 చివరి తేదీ.

Tags

Read MoreRead Less
Next Story