బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో భారీ వర్షాలు!

X
By - Admin |26 Aug 2020 9:43 AM IST
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మంగళవారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారిందని హైదరాబాద్ వాతవరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు పాంత్రాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com