తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించిన కవిత.. హరిదా రచయితల సంఘం 5వ మహాసభలో పాల్గొన్నారు

తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సమాజ హితం కోసం పనిచేసే సాహిత్యం రావాలని ఆకాంక్షించారు. మానవత్వాన్ని కొల్లగొట్టడానికి వస్తున్న అడ్డంకులను తరిమికొట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించిన ఆమె.. హరిదా రచయితల సంఘం 5వ మహాసభలో పాల్గొన్నారు. జులై 22న దాశరథి జయంతి సందర్భంగా ఖిల్లా జైలులో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కవిత తెలిపారు. ఢిల్లీ నడి బొడ్డున ఒక ఆడబిడ్డను దారుణంగా చంపుతుంటే చుట్టూ ఉన్న వాళ్లు వీడియో తీశారు కాని.. కాపాడే ప్రయత్నం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాహిత్యంతో మనిషి, సమాజపు ఆలోచనను మార్చే శక్తి ఒక చిన్న సిరా చుక్కకు మాత్రమే ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story