సిక్స్‌ప్యాక్‌తో ఆండ్రియా..అదిరిపోయే ఫోటోస్‌

సిక్స్‌ప్యాక్‌తో ఆండ్రియా..అదిరిపోయే ఫోటోస్‌
సిక్స్‌ప్యాక్‌తో ఆండ్రియా..అదిరిపోయే ఫోటోస్‌

తమిళ నటి, గాయిని ఆండ్రియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సింగర్‌గా కూడా మంచి గుర్తింపే తెచ్చుకుంది. 2005లో వచ్చిన కందా నాల్‌ మదల్‌ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి అందరి చూపులు తనవైపు తిప్పుకున్న ఆండ్రియా ప్రేమాయణాలతో సైతం బజ్‌ క్రియేట్‌ చేసింది. అప్పట్లో హీరో ధనుష్‌, ఫహాద్‌ ఫాజిల్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌తో ప్రేమ పాఠాలు చదివినట్లు వార్తలు చాలానే వచ్చాయి. కొంత కాలం క్రితం అనిరుధ్‌, ఆండ్రియా వ్యక్తిగత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృస్టించాయి. ఈ వీడియోల పట్ల అప్పట్లో నానా రభస చోటు చేసుకుంది. అయితే ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ఈ అమ్మడు తన గ్లామర్‌ ఫోటొలను షేర్‌ చేస్తూ కుర్రకారుకు కిక్కిస్తోంది. తాజాగా తన అభిమానులకు హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. సిక్స్‌ ప్యాక్‌ పెంచేసి వాటిని చూపెడుతూ కుర్రకారులో హీట్‌ పెంచేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story