పెళ్లిపట్టాలెక్కిన పరిణితి ప్రేమాయణం

పరిణితి చోప్రా ప్రేమవ్యవహారంపై పుంకాను పుంకంగా పుకార్లు షికార్లు కొట్టాయి. ఇన్నాళ్లుగా దాగుడు మూతల ఆటకు చివరకు తెరపడింది. పరిణితి చోప్రా, ఆప్ యువ ఎంపీ రాఘవ్ చడ్డా ప్రేమ వ్యవహారం నిన్న మొన్నటి వరకు తెగ గాసిప్స్‌కు దారి తీసింది. అయితే తాజాగా ఈ జంట మొత్తానికి ఒకటి కాబోతున్నారు. నేడు ఢిల్లోలో ఇరువురి కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య వీరి ఎంగేజ్‌మెంట్ ఘణంగా జరగబోతోంది.
అయితే ఈ వేడుకకు పరిణితి సోదరి ప్రియాంక చోప్రా కూడా హాజరు కాబోతోంది. తన సోదరి ఎంగేజ్‌మెంట్‌కు హాజరవ్వడానికి లండన్ నుంచి బయలుదేరింది. కాగా ఈ కార్యక్రమం మెత్తం పక్కాపంజాబీ పద్దతిలో ఉండనుంది. వీరి ఎంగేజ్‌మెంట్‌కు ఆప్ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్ మాన్ కూడా హాజరు కానున్నారని బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంగేజ్‌మెంట్‌లో పవన్ సచ్‌దేవ్ డిజైన్ చేసిన దుస్తుల్లో రాఘవ్ మెరవనుండగా పరిణితి మాత్రం మనిష్ మాల్హోత్రా అవుట్‌ఫిట్‌లో ముస్తాబవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com