Bollywood: బాడీగార్డ్ తో అనుష్క శర్మ చక్కర్లు.. ఫైన్ వేసిన పోలీసులు

Bollywood: బాడీగార్డ్ తో అనుష్క శర్మ చక్కర్లు.. ఫైన్ వేసిన పోలీసులు
X

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క షర్మ బాడీ గార్డ్ చిక్కుల్లో పడ్డాడు. ఇటీవల అనుష్క శర్మ ముంబై వీధుల్లో బైక్ పై ప్రయాణించారు. రోడ్డు ట్రాఫిక్ తో బ్లాక్ అయినందున తాను చేరుకునే స్థానానికి బైక్ ద్వారా వెళ్లారు. ఆవిడ బాడీ గార్డు సోనూ షేక్ బైక్ నడపగా ఆవిడ తన గమ్యస్థానానికి చేరుకున్నారు. అయితే అనుష్కను జనాలు గుర్తించారు. వెంటనే వారి పోన్ లకు పనిచెప్పారు. ఈ వీడియో వైరల్ అయింది. అనుష్క, ఆవిడ బాడీ గార్డు హెల్మెట్ ధరించలేదని నెటిజన్లు పట్టేశారు. వెంటనే ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. అనుష్క బాడీ గార్డుకు రూ.10,500 జరిమానా విధించినట్లు తెలుస్తోంది. ఆతర్వాత అతను జరిమానాను కట్టేసినట్లు పోలీసులు తెలిపారు. అతనిపై సెక్షన్ 129/194, సెక్షన్ 5/180 & సెక్షన్ 3(1)18 కింద కూడా చలాన్ జారీ చేయబడింది.

అనుష్క లాగానే లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కూడా హెల్మెట్ లేకుండా బైక్ రైడ్ చేస్తూ కనిపించారు. అయితే, తాను ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని సీనియర్ నటుడు స్పష్టం చేశారు.


బిగ్ బి తన బ్లాగ్‌లో, “విషయం ఏమిటంటే ముంబైలోని ఓ వీధిలో షూటింగ్‌ ఉంది.. అది ఆదివారం .. బల్లార్డ్ ఎస్టేట్‌లోని ఒక లేన్‌లో షూట్ చేయడానికి అధికారిక అనుమతి తీసుకున్నారు.. ఆదివారం అనుమతి కోరింది ఎందుకంటే అన్ని కార్యాలయాలు మూసివేయబడి ఉంటాయి కాబట్టి. పబ్లిక్, ట్రాఫిక్ లేదు .. షూటింగ్ కోసం పోలీసుల అనుమతితో ఆ ప్రాంతంలోని ఒక లేన్ బ్లాక్ చేయబడింది .. లేన్ కేవలం 30-40 మీటర్లు .. నేను ధరించిన దుస్తులే సినిమా కోసం నా దుస్తులు." అని తెలిపారు.

Tags

Next Story