వరల్డ్ టాప్ 100 ప్రతిభావంతుల లిస్ట్‌లో జక్కన్న, షారుఖ్

వరల్డ్ టాప్ 100 ప్రతిభావంతుల లిస్ట్‌లో జక్కన్న, షారుఖ్
టైమ్స్ వరల్డ్ టాప్ 100 ప్రతిభావంతుల లిస్ట్లో రాజమౌళికి స్థానం దక్కింది. టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో ప్రస్తుతం దర్శకధీరుడు

టైమ్స్ వరల్డ్ టాప్ 100 ప్రతిభావంతుల లిస్ట్ లో రాజమౌళికి స్థానం దక్కింది. టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో ప్రస్తుతం దర్శకధీరుడు జక్కన్న రాజమౌళి ఒక్కో సినిమాతో ఎంతో గొప్ప క్రేజ్ ని భారీ సక్సెస్ లని సొంతం చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుతో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆయన ఎన్టీఆర్, చరణ్ లతో తీసిన ఆర్ఆర్ఆర్ మూవీ గ్లోబల్ గా సక్సెస్ కావడంతో పాటు అందులోని నాటు నాటు సాంగ్ ఏకంగా ఆస్కార్ అందుకోవడంతో దర్శకుడిగా రాజమౌళి వరల్డ్ ఫేమస్‌ అయ్యారు.

మరోవైపు ఇదే లిస్ట్ లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా స్థానం దక్కించుకున్నారు. రాజమౌళి కి ఐకానిక్ క్యాటగిరిలో, షారుఖ్ కి పయోనీర్స్ క్యాటగిరిలో చోటు దక్కించుకున్నారు. రాజమౌళికి ఇంత పెద్ద గుర్తింపు రావడంతో ఆయన ఫ్యాన్స్‌, మూవీ లవర్స్‌ సోషల్ మీడియాలో విషెష్‌ తెలుపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story