National Film Awards: జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. సత్తా చాటిన 'కలర్ ఫోటో'..

National Film Awards: జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ చిత్రంగా కలర్ ఫొటో ఎంపికైంది. అలాగే ఉత్తమ కొరియోగ్రఫీగా సంధ్యా రాజుకు దక్కింది. ఇక బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ఎంపికయ్యారు. 'అల వైకుంఠపురం' సినిమాలో తమను ఇచ్చిన బెస్ట్ మ్యూజిక్‌కి ఈ అవార్డ్ వరించింది. 2020వ సంవత్సరంలో సినిమాలకు ఈ అవార్డులు ప్రకటించారు.
యావత్ దేశాన్ని కోవిడ్ మహమ్మారి కుదిపేసి లాక్‌డౌన్‌లకు కారణమైన టైమ్‌లో.. మొత్తం సినిమాల స్వరూపమే మారిపోయింది. అప్పటికే రిలీజ్ అయిన వాటి విషయం ఒక ఎత్తయితే.. ఆ తర్వాత ధియేటర్లు తెరిచే అవకాశం లేకపోవడంతో చాలా సినిమాలు OTTల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలాంటి ఏడాది 2020కి సంబంధించిన సినిమాలకు ఇవాళ అవార్డులు ప్రకటించారు. 68వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈఏడాది మొత్తం 30 భాషల్లో 305 ఫీచర్ ఫిల్మ్ ఎంట్రీకివచ్చాయి. అలాగే నాన్ ఫీచర్ కేటగిరిల్లో 148 చిత్రాలు స్క్రీనింగ్ వచ్చినట్లు జ్యూరీ మెంబర్స్ తెలిపారు. అందులో 22 సినిమాలు అవార్డులు అందుకున్నాయి. నాన్ ఫీచర్ విభాగంలో 28 అవార్డులను ప్రకటించారు. తెలుగులో ఆకాశమే హద్దురా పేరుతో రిలీజైన తమిళ సినిమా 'సూరారై పోట్రు' కూడా ఉత్తమ చిత్రం పురస్కారం గెలుచుకుంది. జాతీయ ఉత్తమ నటులుగా సూర్య, అజయ్ దేవగణ్ అవార్డులు అందుకోనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com