76వ కేన్స్ చలన చిత్రోత్సవాల్లో దేశీ హంగామా
![76వ కేన్స్ చలన చిత్రోత్సవాల్లో దేశీ హంగామా 76వ కేన్స్ చలన చిత్రోత్సవాల్లో దేశీ హంగామా](https://www.tv5news.in/h-upload/2023/05/19/971041-mrunalthakurcannes2023216844788472141684478847358.avif)
ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్(Cannes International Film Festival) అట్టహాసంగా జరుగుతుంది. 76వ కేన్స్ చలన చిత్రోత్సవాల్లో రెడ్ కార్పెట్ పై బ్యూటిఫుల్ యాక్టర్స్ హొయలొలికిస్తూ అలరించారు. ఇప్పటికే కేన్స్ రెడ్ కార్పెట్‌పై సారా అలీఖాన్, ఈషా గుప్తా, ఊర్వశీ రౌతేలా క్యాట్ వాక్‌తో ఆకట్టుకున్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ తొలిసారి పాల్గొంటున్నది. రెడ్ కార్పెట్‌పై సందడి చేసే ముందు అందమైన చీరకట్టులో తీయించుకున్న కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుందీ భామ. కేన్స్ ఫిల్మ్‌ఫెస్ట్‌వల్‌లో పాల్గొనడం అరుదైన అవకాశమని ఆనందం వ్యక్తం చేసింది. ఆరు గజాల చీరలోనే అసలైన అందం దాగి ఉంటుందని మృణాల్ ఠాకూర్‌అంటోంది.
లేటెస్ట్గా ఆస్కార్ అవార్డు విన్నింగ్ ప్రొడ్యూసర్ గునీత్ మోంగా, ఖుష్భూ, అమీ జాక్సన్, దర్శక,రచయిత, నిర్మాత,నటుడు విఘ్నేష్ శివన్, ప్రదీప్ రంగనాథన్‌లు పాల్గొన్నారు. ఇక మృణాల్ ఠాకర్, ఐశ్వర్యా రాయ్ అద్భుతమైన అవుట్‌ఫిట్స్‌లో రెడ్ కార్పెట్‌పై మెరిశారు. మొత్తానికి కాన్స్‌లో దేశీ హంగామా బాగానే కనబడుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com