Aadhi Pinisetty: టాలీవుడ్ క్యూట్ కపుల్.. పెళ్లి వీడియో గ్లింప్స్ విడుదల..

Aadhi Pinisetty: టాలీవుడ్ క్యూట్ కపుల్.. పెళ్లి వీడియో గ్లింప్స్ విడుదల..
Aadhi Pinisetty: సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి వారసుడిగా సినిమాల్లోకి ఎంటర్ అయ్యాడు ఆది పినిశెట్టి.

Aadhi Pinisetty: సినీ పరిశ్రమలో ఏ ఇద్దరు నటీనటులు సన్నిహితంగా ఉన్నా.. వారు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని రూమర్స్ మొదలయిపోతాయి. కానీ అందులో కొన్ని రూమర్స్ మాత్రం నిజమే అవుతాయి. కానీ ఏ మాత్రం వారి ప్రేమ గురించి బయటకు రాకుండా పెళ్లి వరకు వెళ్లిపోయారు ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ. చాలా తక్కువమంది సన్నిహితుల మధ్య వీరి ఎంగేజ్‌మెంట్, పెళ్లి జరిగిపోయాయి. అయితే పెళ్లయిన మూడు నెలల తర్వాత ఆది తన పెళ్లి వీడియో గ్లింప్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి వారసుడిగా సినిమాల్లోకి ఎంటర్ అయ్యాడు ఆది పినిశెట్టి. హీరోగా ఎప్పుడో పరిచయమయినా.. ఆది పినిశెట్టికి గుర్తింపు రావడానికి మాత్రం చాలా సమయమే పట్టింది. అయితే అల్లు అర్జున్ హీరోగా నటించిన 'సరైనోడు'లో ఆది చేసిన విలన్ పాత్ర తన కెరీర్‌ను మలుపు తిప్పింది. అప్పటినుండి హీరోగా, విలన్‌గా సినీ పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. అదే సమయంలో తనతో రెండు సినిమాలు కలిసి చేసిన నిక్కీ గల్రానీతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు.

ఆది, నిక్కీ ఎంగేజ్‌మెంట్ అయిన కొన్నిరోజుల తర్వాత వీరి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ విషయం అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత హల్దీ, పెళ్లి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఇక ఇన్నాళ్ల తర్వాత వీరి పెళ్లి వీడియో గ్లింప్స్‌ను తానే స్వయంగా విడుదల చేశాడు ఆది. 'మిస్టర్, మిసెస్ అయిపోయి మూడు నెలలు అయిపోయినా కూడా నిన్నటిలాగానే అనిపిస్తోంది. మా మ్యాజికల్ డే ఎలా గడిచిందో తెలియజేయడానికి చిన్న గ్లింప్స్ ఇది.' అంటూ ఈ వీడియోను షేర్ చేశాడు ఆది.


Tags

Read MoreRead Less
Next Story